28 October 2012

పాజిటివ్ థింకింగ్


మంచి మానసిక స్థితికి టిప్స్‌

ఆరోగ్యం అంటే శారీరక ఆరోగ్యమే కాదు. మంచి మానసిక స్థితి కూడా కలిగివుండాలి. అప్పుడే సంపూర్ణ ఆరోగ్యం అవుతుంది. ప్రపంచ మానసిక ఆరోగ్య వారోత్సవాల సందర్భంగా ఈ క్రింది సైకలాజికల్‌ టిప్స్‌ అందరికీ ఉపయోగకరంగా ఉంటాయనే ఉద్దేశ్యంతో మీకోసం...
1. మానసిక ఒత్తిడిని గుర్తించండి. మనసును ప్రశాంతంగా ఉంచుకోండి.
2. ఒకేపనిని నిరంతరం చేస్తుండడం వల్ల ఒత్తిడి ఏర్పడుతుంది. కొంత విరామం తీసుకోండి. ప్రశాంతంగా ఉంటారు.


3. ఇతరులను గురించి మంచిగా మాట్లాడండి. మంచిగా ప్రవర్తించండి. అప్పుడే మంచి సంబంధాలు ఏర్పడతాయి.
4.  కోపాన్ని అదుపులో ఉంచుకోండి. మీరు అదుపు తప్పుతున్నప్పుడు కోపాన్ని ఆరోగ్యకరంగా ప్రదర్శించే తీరు నేర్చుకోండి. (మౌనంగా ఉండటం, సద్విమర్శ ద్వారా తెలియచేయడం, అక్కడ నుంచి వెళ్లిపోవడం)
5. ఈర్ష్యాద్వేషాలకు అతీతంగా మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకుంటే ఇతరులతో మంచి సంబంధాలతో పాటు మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు.
6. ఇతరులను చిరునవ్వుతో పలకరించండి. అభినందించండి.
7. స్నేహం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. మంచి స్నేహితుల కోసం అన్వేషించి స్నేహం చేయండి.
8. హాస్యం ఆనందాన్ని ఇస్తుంది. జీవితంలో హాస్యాన్ని జోడిరచండి.
9. సమస్య ఏర్పడ్డప్పుడు సమస్యకు కారణాలు తెలుసుకుని పరిష్కరించుకోవాలి. సమస్యల వలయంలో చిక్కుకుని డిప్రెషన్‌కు లోను కావద్దు.
10. జీవితంలో ఓటమి కూడా సామాన్యమే. ఓటమి పొందినప్పుడు నిరాశా, నిస్పృహలకు లోను కావద్దు. అవి అనుభవాలుగా విజయానికి నాంది అవుతాయి.
11. పిల్లల్ని కొట్టడం, తిట్టడం వల్ల వారితో వ్యక్తిత్వ వికాసం ఏర్పడదు. తెలియచెప్పండి. పొరపాట్లు సరిదిద్దండి.
12. పిల్లల్లో ఉన్న టాలెంట్స్‌ను ప్రోత్సహించండి. అభినందించండి. అప్పుడు వారిలో సానుకూల మనస్తత్వ ధోరణి ఏర్పడుతుంది.
13. మిమ్మల్ని మీరు అభినందించుకోండి. మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. మీలో ఆత్మవిశ్వాసం అభివృద్ధి చెందుతుంది.
14. మీలోని భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడమే కాదు... తెలివిగా వీటిని అనుకూలంగా మలుచుకునే నేర్పరితనం నేర్చుకోండి.
15. ఆత్మహత్యలు పరిష్కారం కాదు. ఒక్కసారి మీ సమస్యలకు పరిష్కార మార్గాలు ఆలోచించండి. మీ సమస్యలు స్నేహితులతో చెప్పండి. కౌన్సిలింగ్‌కు హాజరుకండి. మీకు చక్కటి పరిష్కార మార్గాలు దొరుకుతాయి.
16. భయం వీడితే జయం మీదే అవుతుంది. భయానికి ఒక కారణం ఉంటుంది. ఆ కారణాన్ని పరిష్కరించుకుంటేనే భయం మీకు దూరంగా                    ఉంటుంది.
17. మీలోని ఆత్మన్యూనతను తొలగించుకుంటే మీరు ఎన్నో రంగాల్లో విజయం సాధిస్తారు.
18. మంచి ఆరోగ్యకరమైన కుటుంబంలో పెరిగిన పిల్లలు మంచి మానసిక స్థితిని కలిగి ఉంటారు.
19. మంచి ఆలోచనలు మంచి మానసిక స్థితిని కలిగిస్తాయి.
20. సైకలాజికల్‌ కౌన్సిలింగ్‌ వల్ల మంచి ఆరోగ్యకరమైన మానసిక స్థితిని పొందవచ్చు.
21. యోగా, మెడిటేషన్‌లాంటి రిలాక్సేషన్‌ టెక్నిక్స్‌ ఉపయోగించాలి.
22. పిల్లలతో సరదాగా గడపండి ` మాట్లాడండి.
23. భార్యాభర్తలు ఒకరినొకరు నిందించుకోవడం మానండి. ఆనందంగా గడపండి.
24. శరీర ఆరోగ్యంతో పాటు మనసుకు ప్రాధాన్యత ఇవ్వండి.
25. పాజిటివ్‌ థింకింగ్‌ అలవరుచుకుంటే మంచి మానసిక స్థితి ఏర్పడుతుంది.

No comments:

Post a Comment