9 May 2013

కుతూహలం ఉంటే... కర్తవ్యం ఏమిటో తెలుస్తుంది


 కొండచరియల్లో అలుగు పుట్టిన చోటు నదికి జన్మస్థానం అవుతుంది. సన్నని నీటి చెలమ కొద్దికొద్దిగా విస్తరిస్తుంది. చినుకులా రాలి, నదులుగా సాగి, వరదలైపోయింది అన్నట్లు నీటికి సహజ లక్షణం అది.
హిల్స్టేషన్చూడడానికి చాలామంది యాత్రికులు వచ్చిపోతూ ఉంటారు. అక్కడ ఉండే గైడ్అక్కడ ఉండే అలుగు చూపించి, అది నదిగా ఎలా మారిందో చెబుతూనే ఉంటాడు. ఆరోజు వచ్చిన యాత్రికుల్లో ఒక వ్యాపారి, ఒక వృద్ధుడు, ఒక చిన్నపిల్ల ఉన్నారు. వాళ్లకి కూడా ప్రదేశాన్ని చూపించాడు గైడ్‌.


నేను అలుగుని చూసి గొప్ప పాఠాన్ని నేర్చుకున్నాను అన్నాడు వ్యాపారి. అతను తన మాటల్ని కొనసాగిస్తూ ఇలా అన్నాడు. ఇది చిన్న చిన్న నీటిబట్లుగా మొదలవుతోంది. కానీ వాగులై, వంకలై నెమ్మదిగా ప్రవాహవేగాన్ని పుంజుకుంటోంది. సరైన సమయంలో ఉధృతిగల నదిగా రూపాంతరం చెందుతోంది. సముద్రంలో కలిసే ముందుగా అనేక ప్రాంతాలను సస్యశ్యామలం చేస్తూ ముందుకు సాగిపోతూనే ఉంది. మనం కూడా జీవితంలో నదిలా పనిచేయడం నేర్చుకోవాలి. నేను చిన్న పెట్టుబడితో వ్యాపారం ప్రారంభించి, నెమ్మదిగా అభివృద్ధి చెంది అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించాను.
అతని తరువాత అక్కడికి వచ్చిన వారిలో వృద్ధుడు మాట్లాడాడు. నేను కూడా దీన్ని చూసి చాలా నేర్చుకున్నాను అన్నాడాయన. మనం చేసే సేవ నిశ్శబ్దంగా చేయాలి. ప్రచారాన్ని కోరుకూడదు. స్నేహితులు, పరిచయంలేనివారు అందరినీ సమానదృష్టితో చూడడం అలవాటు చేసుకోవాలి అన్నాడాయన తన అనుభవం అంతా రంగరించి.
గైడ్వాళ్లిద్దరి మాటలకూ చప్పట్లు కొట్టాడు. చివరిగా అక్కడ ఉన్న చిన్నపిల్ల అంది కదా... ఇక్కడ ఉన్న పరిశుభ్రమైన నీటిని చూసి నేను కూడా ఒక పాఠం నేర్చుకున్నాను. పరిశుభ్రంగా లేకపోతే నీరు ఎందుకూ పనికిరాదు. పశువులు కూడా బురదనీటిని తాగలేవు. అలాగే మనం కూడా స్వచ్ఛమైన, సేవాభావంతో నిండిన జీవితాన్ని గడపాలి.
చిన్నపిల్ల చెప్పిన మాటలకు మురిసిపోయి గైడ్ఆమెకు ఒక చాక్లెట్ఇచ్చాడు. ప్రకృతికంటే మంచి గురువు దొరకడు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక విషయాన్ని, ప్రతిరోజూ నేర్చుకోవచ్చు. అలా నేర్చుకోకుండా గడిపేసిన ప్రతిరోజూ వృధా అయినట్లే.
తెలివిగలవారు ఇతరుల తప్పుల నుంచి, తన తప్పుల నుంచిÑ సాధారణ మానవులు తన తప్పుల వలన జరిగిన నష్టం నుంచి పాఠాలు నేర్చుకుంటారు. తన తప్పుల నుంచి కుడా పాఠాలు నేర్చుకోని వారు మూర్ఖులు.
వ్యక్తిత్వ వికాసానికి ఉండాల్సిన లక్షణాలలో కుతూహలం ముఖ్యమైనది. ప్రపంచ ప్రఖ్యాత వ్యక్తులలో ఒక్కరు కూడా కుతూహలం లేనివారు కనబడరు.
 కుతూహలం ఎందుకంత ముఖ్యమైన లక్షణమైంది?
1)కుతూహలం మీ మెదడును మందకొడిగా కాకుండా, చురుకుగా ఉంచుతుంది: కుతూహలం   ఉన్న వ్యక్తులు నిరంతరం ప్రశ్నిస్తూ, తమ మెదడులో ప్రశ్నలకు జవాబులు వెతుకుతూ ఉంటారు. కనుక వాళ్ళ మెదడు ఎప్పుడూ చురుకుగా ఉంటుంది. మెదడు కూడా అన్ని కండరాల లాంటిదే. దానికి ఎంత పని చెబితే అది అంత బలంగా తయారవుతుంది. అంటే కుతూహలం మెదడుకు నిరంతరం పనిచెబుతూ ఉంటుంది కనుక అది ఎప్పటికప్పుడు మరింత బలంగా మారుతుంది.
2)కుతూహలం మీకు కొత్త ఆలోచనలను గ్రహించే శక్తిని ఇస్తుంది: మీకు ఒక విషయం గురించి కుతూహలం కలిగినప్పుడు, మీ మెదడు దానికి సంబంధించిన కొత్త ఆలోచనల కోసం ఎదురుచూస్తూ, ఆశిస్తూ ఉంటుంది. కనుక కొత్త ఆలోచన మన ముందుకు రాగానే దాన్ని ఒడిసి పట్టుకోగలిగి  ఉంటుంది. కుతూహలమే లేకపోతే అదే ఆలోచన మన కళ్ళ ముందు కదిలిపోతున్నా మనం సిద్ధంగా ఉండం కనుక దానిని గమనించలేం. ఒక్కసారి ఆలోచించండి, కుతూహలమే లేకపోతే ఎన్ని గొప్ప ఆలోచనలు వెలికిరాకుండా ఉండిపోయేవో కదా!
3)కుతూహలం కొత్త ప్రపంచాలను, కొత్త అవకాశాలను మీ ముందుకు తెస్తుంది: కుతూహలంగా  ఉండటం వల్ల మీకు మామూలుగా కనిపించిన కొత్త ప్రపంచాలు, కొత్త అవకాశాలు కనిపించడం ప్రారంభిస్తాయి. కొత్త అవకాశాలను, కొత్త ప్రపంచాలను, సాధారణ జీవితపు నిరాసక్తత అనే పొర కప్పిఉంచి, కనిపించకుండా చేస్తుంది. పొరను తొలగించి, కొత్త అవకాశాలను, కొత్త ప్రపంచాలను ఆవిష్కరించడానికి కుతూహలంతో నిండిన మెదడు కావాలి.
4)కుతూహలం మీ జీవితంలో ఉత్తేజాన్ని నింపుతుంది: కుతూహలం ఉన్నవారి జీవితంలో విసుగుకు  చోటుండదు. మీరు కుతూహలంగా ఉన్నప్పుడు నిస్తేజంగా, మందకొడిగా ఉండటం సాధ్యం కాదు. ఎప్పటికప్పుడు మిమ్మల్ని ఆకర్షించే కొత్త విషయాలు, మీకు ఉత్సాహం కలిగించే కొత్త ఆటవస్తువులు ఎదురవుతూనే ఉంటాయి. కుతూహలంతో ఉన్నవారు నిరాసక్తమైన జీవితానికి బదులు ఉత్తేజభరితమైన జీవితాన్ని గడుపుతారు.
కుతూహలం పెంచుకొనేందుకు కొన్ని సూచనలు
1) మెదడు తలుపులు తెరచి ఉంచండి: మెదడులో కుతూహలం ఉండాలంటే ఇది అత్యవసరం. తెలియని దాన్ని నేర్చుకొనేందుకు, తప్పుగా నేర్చుకొన్నదాన్ని మర్చిపోయేందుకు, కొత్త జ్ఞానపు పునాదులపై పాత ఆలోచనలను పునర్విమర్శించుకొనేందుకు ఎప్పుడూ సంసిద్ధంగా ఉండాలి.అనేక కారణాల వల్ల ఇంతకు ముందు మనకు తెలిసిన విషయాలు, మనం నేర్చుకొన్న విషయాలు, మనం నిజమని దృఢంగా విశ్వసిస్తున్న విషయాలు తప్పులై ఉండవచ్చు. విషయాన్ని గుర్తుంచుకొని, మన కొత్త అనుభవాలతో, కొత్త జ్ఞానంతో పాతవాటిని సమీక్షించుకొనేందుకు సిద్ధంగా ఉండాలి.
2) ఇది ఇంతేలే అనుకోకండి: మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని సందేహమూ లేకుండా అంగీకరించడమంటే పవిత్రమైన కుతూహలాన్ని సమాధి చేయడమే. మనకు లభించిన దాన్నిఇది ఇంతేలేఅనుకొని ఆమోదించరాదు. కొంచెం లోతుకి వెళ్ళి అర్థం చేసుకొనేందుకు ప్రయత్నించాలి.
3) నిర్మొహమాటంగా, నిరంతరం ప్రశ్నించండి: ఏమిటి? ఎందుకు? ఎప్పుడు? ఎక్కడ? ఎవరు? ఎలా?  ఎప్పుడు? ప్రశ్నలు మన చుట్టుపక్కల ప్రపంచాన్ని మరింత లోతుగా అర్థం చేసుకొనేందుకు సాధనాలు. ఇవే కుతూహలం కలవారికి స్నేహితులు. ఇది ఏమిటి? ఇది ఇలా ఎందుకుంది? దీన్ని ఎవరు కనుగొన్నారు? ఎప్పుడు తయారుచేశారు? దేనితో, ఎలా తయారు చేశారు? ఇది ఎలా పనిచేస్తుంది? ఇలాంటి ప్రశ్నలు వేయడానికి మొహమాటపడరాదు.
4) పని విసుగు అని విషయంలోనూ నిర్ధారణకు రాకండి: ఒక పనిని, లేదా ఒక విషయాన్నిఇది విసుగుఅని ముద్ర వేస్తున్నామంటే ఒక అవకాశ మార్గాన్ని శాశ్వతంగా మూసివేస్తున్నట్లే. కుతూహలం కల వ్యక్తులు ఎంత కష్టమైన విషయాన్నైనాఇది విసుగు’, ‘ఇది మనకెందులేఅని వదిలేయరు. కష్టమైన విషయాలన్నీ కొత్త అవకాశాలకు మార్గాలుగా గుర్తిస్తారు. వాళ్ళకు విషయంపై కృషి చేసే సమయం లేకపోతే, భవిష్యత్తు కోసం, దారిని అలాగే తెరచి ఉంచుకుంటారు.
5) నేర్చుకోవడాన్ని ఒక సరదాగా మార్చుకోండి: నేర్చుకోవడాన్ని కష్టంగా భావించినప్పుడు విషయాన్ని గురించీ లోతుగా అధ్యయనం చేయాలనే కోరిక ఉండదు. నేర్చుకోవడాన్ని సరదాగా భావించినప్పుడు సహజంగానే ఏవిషయాన్నైనా లోతుగా అధ్యయనం చేయడం అలవాటవుతుంది. జీవితాన్ని ఉత్సాహం, ఉత్తేజం అనే కళ్ళద్దాల గుండా చూడాలి, నేర్చుకోవడాన్ని సరదాగా మార్చుకోవాలి.
6) రకరకాల పుస్తకాలు చదవండి: ఎప్పుడూ ఒకే ప్రపంచంలో మునిగిపోకండి. మిగిలిన ప్రపంచం వైపు కూడా చూడండి. అలా చూసినప్పుడు మనకు అక్కడున్న ఉత్తేజకరమైన అంశాలు,  కొత్త అవకాశాలు పరిచయమౌతాయి. అవి మీకు ఆసక్తిని కలిగించి మరింత అన్వేషణకు పురికొల్పవచ్చు. ఇలా కొత్త కొత్త ప్రపంచాలను పరిచయం చేసుకోవడానికి ఒక తేలికైన మార్గం వివిధ రకాల పుస్తకాలు చదవడం. మీకు ఇంతకు ముందు పరిచయంలేని రంగానికి సంబంధించిన ఒక పత్రికో, పుస్తకమో చదివి చూడండి. అది మీ మెదడును ఉత్తేజంతో నింపడం గమనిస్తారు.

No comments:

Post a Comment